‘మాచెర్ల నియోజకవర్గం’ క్లోసింగ్ కలెక్షన్స్..హీరో నితిన్ కి ఇది చావు దెబ్బ

-

నితిన్ హీరో గా నటించిన మాచెర్ల నియోజగవర్గం అనే సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై ఇటీవలే బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..టీజర్ , ట్రైలర్ మరియు పాటలతో ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను రేపిన ఈ చిత్రం విడుదల తర్వాత ఆ అంచనాలను కనీస స్థాయి లో కూడా అందుకోలేకపోవడం బాధాకరం..నాసిరకం స్టోరీ లైన్ తో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆడియన్స్ కి చిరాకు రప్పించాడు..కథలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడం వల్ల ఈ సినిమా ఒక్క వర్గం ప్రేక్షకులను కూడా ఆకట్టు లేకపోయింది..భీష్మ సినిమా తర్వాత సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న నితిన్ కి మాచెర్ల నియోజకవర్గం సినిమా పేరు తో మరో ఎదురు దెబ్బ పడింది అనే చెప్పాలి..అయితే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమాకి ఓపెనింగ్స్ అదిరిపొయ్యే రేంజ్ లో వచ్చాయనే చెప్పాలి..యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో నితిన్ కి ఉన్న క్రేజ్ వల్లే ఆ ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పొచ్చు.

మొదటి రోజు ఓపెనింగ్స్ తో పాటు వీకెండ్ కలెక్షన్స్ కూడా పర్వాలేదు అని అనిపించే రేంజ్ లో వచ్చాయి..ఇక వీకెండ్ తర్వాత ఈ సినిమా వసూళ్లు అమాంతం తగ్గిపోయాయి..కానీ కాస్త యావరేజి టాక్ వచ్చినా కూడా ఈ సినిమా సూపర్ హిట్ స్టేటస్ కి అవలీలగా చేరుకునేది అంటూ ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల రూపాయలకు జరగగా ఇప్పుడు అన్ని ప్రాంతాలలో క్లోసింగ్ కలెక్షన్స్ కి దగ్గరకి వచ్చేసింది..ప్రాంతాల వారీగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయి..బయ్యర్స్ కి ఎంత నష్టాలను ఈ సినిమా మిగిలించింది అనేది ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము..మొదటి రోజు ఈ సినిమాకి ఏకంగా 5 కోట్ల రూపాయిల షేర్ వచ్చింది..ఇది నితిన్ కెరీర్ లోనే టాప్ 3 ఓపెనింగ్స్ సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచిపోయింది..ఇక ఆ తర్వాత రెండవ రోజు రెండు కోట్ల రూపాయిల షేర్..మూడవ రోజు కోటి 80 లక్షల షేర్ మరియు నాల్గవ రోజు కోటి 20 లక్షల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం ఫుల్ రన్ లో 13 కోట్ల రూపాయిల షేర్ కి చేరింది.

నితిన్ మొదటి సినిమా నుండి నైజం ప్రాంతం లో మంచి పట్టు ఉంది..జయం సినిమా ఇక్కడ ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది..ఆ తర్వాత కూడా నితిన్ సూపర్ హిట్ సినిమాలకు నైజాం ప్రాంతం లో మంచి వసూళ్లే వచ్చేవి..కానీ మాచెర్ల నియోజకవర్గం సినిమా ఈ ప్రాంతం లో కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయింది..ఈ చిత్రానికి నైజం ప్రాంతం లో 8 కోట్ల రూపాయిలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ఫుల్ రన్ లో కేవలం 3 కోట్ల రూపాయిల వసూళ్లను మాత్రమే రాబట్టింది..ఇక సీడెడ్ ప్రాంతం లో కూడా ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ గానే మిగిలింది..ఇక్కడ ఈ సినిమా కేవలం కోటి 60 లక్షల రూపాయిల షేర్ ని మాత్రమే వసూలు చేసింది..ఇక ఉత్తరాంధ్ర ప్రాంతం లో కోటి 20 లక్షలు..గుంటూరు జిల్లాలో కోటి రూపాయిలు..కృష్ణ , నెల్లూరు , ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు కలిపి 11 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది..ఇక ఓవర్సీస్ మరియు రెస్ట్ అఫ్ ఇండియా లో ఈ సినిమాకి వచ్చిన వసూళ్లను అసలు లెక్కలోకి కూడా తీసుకోబుద్ది కాదు..ఆ ప్రాంతాలలో ఈ సినిమా కనీసం కోటి రూపాయిల షేర్ ని కూడా వసూలు చెయ్యలేదు..అలా ప్రపంచవ్యాప్తంగా 12 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ చిత్రం బయ్యర్లకు 10 కోట్ల రూపాయిల నష్టాలను మిగిలించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version