గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంపై బిగ్ ట్విస్ట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ గా మాజీ ఎమ్మెల్యే మధుసూదనా చారిగా ఫైనల్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాజ్ భవన్ కు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ రాష్ట్ర మంత్రుల సంతకాలతో రాజ్ భవన్ కు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఫైల్ చేరింది.
ఇక ఈ ఫైల్ పై తెలంగాణ గవర్నర్ ఆమోదమే చేయాల్సి ఉంది. ఇవాళ మధ్యాహ్నం లోపు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. టీఆర్ఎస్ యంగ్ లీడర్ కౌశిక్ రెడ్డి ఫైల్ పెండింగ్ పెట్టడం తో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో అసెంబ్లీ స్పీకర్ గా మధుసూదనా చారి పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే.. 2018 ముందస్తు ఎన్నికల్లో మధుసూదనా చారి.. భూపాల పల్లి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే.. తాజాగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ గా మాజీ ఎమ్మెల్యే మధుసూదనా చారిగా ఫైనల్ చేశారు.