దేవుడా..వీళ్లకు ఎవరైనా చెప్పండ్రా బాబు..

-

చాలా మంది దేవుడు పేరు చెప్పి ప్రాణాలను రిస్క్ లో పడేస్తున్నారు.విజయదశమి సందర్భంగా కొన్ని ప్రాంతాల లో భక్తి పేరుతో భయంకర విన్యాసాలు చేశారు.కొన్నిటిని చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.మందసౌర్‌లోని నల్చా మాత మందిర్ సమీపంలో వందలాది మంది ప్రజలు గుమిగూడారు.దేవుడి మీద భక్తి పేరుతో ప్రజలు మండుతున్న మంటలపై పరుగులు తీయడం కనిపించింది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న కొందరు భక్తులు మంటల్లో నెయ్యి పోస్తున్నారు.

మూఢనమ్మకాలతో కూడిన ఈ రేసులో, ప్రజలు ఇది తమ జీవితాలకు అగ్నిపరీక్షగా భావించి తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంగా మధ్యప్రదేశ్ (ఎంపి)లోని మందసౌర్ జిల్లాలోని నల్చా మాత ఆలయ ప్రాంతం నుండి చుల్ నిర్వహిస్తారు. నిప్పుల మీద నడవటం వల్ల మనసులోని కోరికలు తీరుతాయని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు..

మందసౌర్ జిల్లాలో, నల్చా మాత ఆలయ పరిధిలోని ఒక గొయ్యిలో కట్టెలు వేసి గొయ్యికి నిప్పంటించారు. కొంత సేపటి తర్వాత అందులో నెయ్యి పోస్తారు. దాంతో అక్కడ మంటలు మండుతూనే ఉంటాయి. ఆ తరువాత ఇక ఒకరి తర్వాత ఒకరు ఈ నిప్పులపై నడవటం మొదలుపెడతారు. అలా మంటల్లో నడిస్తే.. ఆ దేవత తన కోరికలను తీరతాయని నమ్మకం.. అయితే కొంత మంది నిప్పుల పై నడుస్తున్నప్పుడు భయ పడతారట.. అయినా కూడా నిప్పుల మీద నడవకుండా వారిని ఆపలేరు. అలాంటి సాహాసం కూడా ఎవరూ చేయరు.

ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే..ఈ విషయంలో పాలనా యంత్రాంగం కూడా చేతులు ముడుచుకు నిలబడాల్సిందే. అధికారులు,పరిపాలన యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తూ చూడాల్సిందే. అగ్నిమాపక దళ బృందం ఇక్కడ కనిపించదు, భద్రతా చర్యలు లేవు..ఇక పోలిసులే ఈ తతంగాన్ని చూస్తూ ఉండిపోతుందని అక్కడ జనాలు అంటున్నారు. ఏది ఏమైనా సైన్స్ ఇంతగా ముందుకు వెళుతుంటే ఇలాంటి వాటిని నమ్మడం ఏంటని కొందరు విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version