ఇన్ స్టాలోనూ మహేశ్..అభిమానుల ప్రశ్నలకు సూపర్ స్టార్ సమాధానాలివే

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ ను నెక్స్ట్ లెవల్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వి్ట్టర్ వారితో స్పెషల్ వీడియో చేశారు. ట్విట్టర్ ఇండియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో బాగా వైరలయింది కూడా. కాగా, తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగానూ మహేశ్ సందడి చేశారు.

ఇన్ స్టా వేదికగా #AskMeAnything హ్యాష్ ట్యాగ్ తో అభిమానులు అడిగిన ప్రశ్నల్లో కొన్నిటికీ మహేశ్ బాబు సమాధానాలిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మహేశ్ బాబే ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. సదరు వీడియో నెట్టింట బాగా వైరలవుతోంది.

‘సర్కారు వారి పాట’ చిత్రంలో నచ్చిన పాట ఏదని అడగగా, ‘కళావతి’ అని చెప్పేశారు సూపర్ స్టార్. పిక్చర్ లో నచ్చిన పోస్టర్ ఫస్ట్ రిలీజ్ అయిన మెడ మీద రూపాయి స్టాంపుదేనని చెప్పుకొచ్చారు ప్రిన్స్. ఇటీవల కాలంలో తనకు బాగా నచ్చిన ఫిల్మ్ RRR అని వివరించారు. తనకు వీలయినంత వరకు ప్రశ్నలకు సమాధానాలిచ్చానని, త్వరలో మళ్లీ కలుద్దామని మహేశ్ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

https://www.instagram.com/tv/CdZ6riil2HW/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news