SSMB28 : మహేష్, త్రివిక్రమ్ మూవీ గ్రాండ్ లాంచ్

-

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ వీరిద్దరిది హిట్‌ కాంబినేషన్‌. గత కొన్ని సంవత్సరాలుగా వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. 2005 లో అతడు, 2010 లో ఖలేజా లాంటి సినిమాలు చేసిన అనంతరం వీరి కాంబినేషన్‌ లో మూడో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూసారు అభిమానులు.

అయితే.. ఇటీవలే ssmb28 పేరుతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు త్రివిక్రమ్‌. అయితే.. ఈ సినిమా సంబంధించి ఓ అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా గ్రాండ్‌ గా ఇవాళ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ముహుర్తపు షాట్‌ సన్నివేశాలను తెరకెక్కించారు. హారిక హాసిని బ్యానర్‌ రూపొందిస్తున్న ఈ సినిమాలో పూజా హేగ్డే హీరోయిన్‌ గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్‌ సంగీత స్వరాలు అందిస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే.. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news