క్రిస్మస్‌ పార్టీకి ఈ డైట్‌ కేక్‌ చేయండి.. డైట్‌లో ఉన్నా ఫుల్‌గా తినేయొచ్చు..!!

-

కేక్ తినడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందరూ తింటారు. అసలే ఇది డిసెంబర్‌ నెల. ఈ మంథ్‌లో సెమీ క్రిస్మస్‌, క్రిస్మస్‌, న్యూఇయర్‌ ఇలా చాలా సెలబ్రేషన్స్‌ ఉన్నాయి. వీటన్నింటికి కేక్‌ కావాలి. కానీ కొంతమంది డైట్‌లో ఉండి ఉంటారు. వాళ్లు కేక్‌ను ఎంజాయ్‌ చేయలేరు. నోరు లాగేస్తున్నా.. తినకుండా ఉండటం కష్టం కదా..! మీ కోసమే మేం టేస్టీగా ఉండే డైట్ కేక్‌ను తీసుకొచ్చాం. ఇంట్లోనే సులభంగా ఈ కేక్‌ను చేసేయండి. దీని వల్ల మీ డైట్‌కు ఎలాంటి నష్టం ఉండదు. డైట్‌లో ఉన్నవాళ్లు ఎప్పుడూ కేక్ తినలేరు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఖర్జూరం మరియు పిండితో ఈ సంవత్సరం క్రిస్మస్ కేక్‌ను తయారు చేయండి. డైట్ కేక్ ఎలా తయారు చేయాలో మరియు దాని తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

 

డైట్‌ కేక్‌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..

ఖర్జూరం ముక్కలు – అర కప్పు
పిండి – 200 గ్రాములు
గుడ్లు – 3
వెన్న – అర కప్పు
బెల్లం పొడి 100 గ్రాములు
బేకింగ్ పౌడర్ – అర టీస్పూన్
వెనీలా ఎసెన్స్ – ఒక టీస్పూన్
తరిగిన డ్రై ఫ్రూట్స్ – కావలసిన విధంగా

డైట్ కేక్ రెసిపీ ఎలా చేయాలంటే..

ముందుగా ఖర్జూరాలను బాగా కడిగి కొద్దిగా నానబెట్టి బ్లెండ్ చేయాలి. తర్వాత బెల్లం పొడి గుడ్డు మరియు వెన్న కలిపి బాగా కలపాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్‌, బేకింగ్‌ పౌడర్‌, వెనీలా ఎసెన్స్‌ను ఒక్కొక్కటిగా కలపాలి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని బేకింగ్ ట్రేలో పోయాలి. ఇప్పుడు 45 నుంచి 50 నిమిషాలు పాటు ఒమెన్‌లో లేదా.. డుబుల్‌ స్టీమ్‌లో గ్యాస్‌మీద పెట్టండి. అంతే డైట్‌ కేక్‌ రెసిపీ రెడీ.! ఇవే కాదు.. కేక్‌ను హెల్తీగా చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కేవలం పంచదారనే వాడక్కర్లేదు. ఫ్రూట్స్‌తో కూడా కేక్‌ను టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం అవి ఎలా చేయాలో ఒక్కొటిగా తెలసుకోండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version