సరికొత్త రికార్డుని క్రియేట్ చేసిన మలయాళం సినిమా..!

-

మలయాళం లో 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ ప్రేమలు తెలుగులో వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. థియేటర్లలో రిలీజ్ అయి నెలరోజులు దాటినా మలయాళం లో ఈ మూవీ ప్రభంజనం కొనసాగుతోంది భావన స్టూడియోస్ బ్యానర్ మీద ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన, శ్యామ్ పుష్కరణ నిర్మించిన ప్రేమలు మూవీ సూపర్ హిట్ అవుతోంది.

ఈ రొమాంటిక్ కామెడీ సినిమాకి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించారు 10 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్లని రాబట్టింది. తెలుగులో కూడా ప్రేమలు సినిమా దుమ్ము దులిపేస్తోంది. మార్చి 8న తెలుగులో ప్రేక్షకుల ముందుకి వచ్చింది భారీ అంచనాలతో వచ్చిన ప్రేమలు కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది తెలుగు వర్షన్ 15 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైం అత్యధిక వసూళ్లను రాబట్టిన తెలుగు డబ్బింగ్ మలయాళం మూవీ గా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version