ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిమాండ్ల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల విఫలం కావడంతో రైతును దేశ రాజధాని ఢిల్లీలో ఇంకోసారి భారీ ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధమయ్యారు దీంతో పోలీసులు అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున బలగాలని మోహరించారు. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్రం మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
10 ఏళ్లుగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రధాని నరేంద్ర మోడీ రైతులు గొంతుని నొక్కేస్తున్నారని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 750 మంది రైతులు ఎలా ప్రాణాలని కోల్పోయారో గుర్తుంచుకోండి అని ఆయన హిందీలో పోస్ట్ చేశారు పదేళ్లలో దేశంలోని అన్నదాతలు ఇచ్చిన మూడు వాగ్దానాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు.