ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలో మరో మలుపు.. చివరి నిమిషంలో పోటీలోకి ఖర్గే

-

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ తన పోటీని ఖాయం చేయడంతో అభ్యర్థులు ఖరారైనట్లే కన్పించింది. చివరి నిమిషంలో మరో సీనియర్‌ నేత, రాజ్యసభ ఎంపీ మల్లికార్జున్‌ ఖర్గే బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ హైకమాండ్‌ కూడా ఖర్గేవైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

పార్టీ హైకమాండ్‌ సూచించే ‘అధికారిక’ అభ్యర్థిగా మల్లికార్జున్‌ ఖర్గే అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ఖర్గే నేడు భేటీ కానున్నారు. అనంతరం పోటీపై తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది. ఆ తర్వాత నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఎన్నికకు ఎంపీలు శశిథరూర్‌, దిగ్విజయ్‌ సింగ్‌ బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఖర్గే పోటీ ఖాయమైతే అధినాయకత్వ పదవికి త్రిముఖ పోరు నెలకొననుంది.

Read more RELATED
Recommended to you

Latest news