కాంగ్రెస్ నేత మల్లు రవి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడిగా రాజీనామా చేశారు. అకస్మాత్తుగా ఆయన రాజీనామా చేయడంపై కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందారు. అయితే తను రాజీనామా చేసింది ఇతర నాయకులపై కోపంతోనో.. పార్టీపై అసహనంతోనో కాదని మల్లు రవి క్లారిటీ ఇచ్చారు.ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో తాము మద్దతివ్వాలనుకున్న అభ్యర్థి తరఫున ప్రచారం చేయాలంటే పార్టీలో తామున్న పదవి నుంచి రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఇదివరకే స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మల్లు రవి రాజీనామా చేశారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న మల్లికార్జున ఖర్గే పక్షాన ప్రచారం చేసేందుకు మల్లు రవి సిద్ధమయ్యారు. అక్కడ ప్రచారం చేసేందుకే పార్టీలో తన హోదాను వదులుకున్నట్లు ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నాయని అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు మల్లు రవి ప్రకటించారు. తన రాజీనామాను మల్లు రవి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పంపారు.