పరిపూర్ణ ఓటమి చూసిన బాబుకు “మనలోకం” సూచనలు ఇవి!

-

రాజకీయాల్లో గెలుపోటములు అత్యంత సహజం. ఒకసారి ఓడిపోతే.. మరింత ధైర్యంగా, మరింత గట్టిగా మరోసారి పోటీచేయడం, ధీటుగా గెలవడం చూస్తూనే ఉంటాం. అయితే… గతకొంతకాలంగా చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారవుతుంది. పార్టీ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో పతనానికి చేరుకుంది. అయితే… ఇప్పుడు టీడీపీ ముందున్న ప్లాన్స్ ఏమిటి? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? ఇప్పుడు చూద్దాం…!

Nara-Chandrababu-Naidu
Nara-Chandrababu-Naidu

పరిపూర్ణ ఓటమి!:

2019 సార్వత్రిక ఎన్నికల్లో చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఓటమి చవిచూసిన చంద్రబాబుకు… ఆ తర్వాత పంచాయతీ ఎన్నికల రూపంలో మరో పరాభవం ఎదురైంది. ఆ పరాజయాల పరంపరకు కొనసాగింపుగా ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల రూపంలో చంద్రబాబు ఓటమి పరిపూర్ణం అయిందనే చెప్పుకోవాలి. అది ఎంతలా అంటే… సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత మండలం, సొంత గ్రామంలో కూడా ప్రభావం చూపించలేకపోయినంతగా!

ఎలా ఉండాలి?:

జరిగిన ఘోర అవమానాలను పునాదులుగా వేసుకుంటూ చంద్రబాబు ముందుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ చావుదెబ్బల నుంచి వీలైనంత తొందరగా కోలుకోవాలి. అంతకంటే ముందు కార్యకర్తలకు ధైర్యం కలిగించాలి. “నేను ఉన్నాను” అనే నమ్మకం కలిగించాలి. వారికి భవిష్యత్తుపై ఆశలు కలిగించాలి.. వారిలో కదలికలు తేవాలి.. వారిని కలుపుకుపోవాలి!

ఎలా ఉండకూడదు!:

చినబాబుని ముందుంచడం టీడీపీకి రిస్క్ అన్న విషయం.. నచ్చినా నచ్చకున్నా బాఅబు ఒప్పుకోవాలి.. కుమారుడిని ఒప్పించాలి. పుత్రప్రేం చాటున పార్టీకి జరుగుతున్న డేమేజ్ ని గ్రహించాలి. కేటీఆర్ ను కేసీఆర్ నిలబెడుతున్నట్లుగా నిలబెట్టుకోవాలి తప్ప… ఆ జ్ఞానంతో జనాల్లోకి వదిలేస్తే… ఏపీ మొత్తం మంగళగిరి అయిపోద్దనే విషయం బాబు మరిచిపోకూడదు!

బుచ్చయ్య లాంటి సీనియర్లు, జేసీ ప్రభాకర్ లాంటి నేతలు చెబుతున్న మాటల్లో కేవలం విమర్శలను మాత్రమే కాకుండా… ఆ విమర్శల్లో అంతర్లీనంగా ఉన్న భావాలను గ్రహించే పరిపక్వత బాబు సంపాదించుకోవాలి. వారి వారి బాదలు పర్సనల్ గా చెప్పుకునే అవకాశం కల్పించాలే తప్ప.. రచ్చకెక్కే పరిస్థితి తెప్పించకూడదు!

ముందున్న ప్లాన్స్:

ప్రస్తుతం ఏపీలో టీడీపీ పతన పరిస్థితి గురించి ఎంతచెప్పుకున్నా తక్కువే. అలా అని పార్టీకి పూర్వవైభవం తెచ్చుకోవడం అసాధ్యం కాదని గ్రహించాలి. ఇప్పటికైనా చంద్రబాబు భాగ్యనగరాన్ని వదలాలి.. ఏపీకి రావాలి.. కార్యకర్తల్లో కదలికలు తేవాలి. ఇప్పటికీ ఏపీలో టీడీపీకి బలమైన కేడర్ ఉందనేమాట జగమెరిగిన సత్యం. కాకపోతే వారిని కాపాడుకునే బలమైన నాయకత్వం లేదనే విషయం బాబు గ్రహించాలి. కేడర్ ను కాపాడుకోవాలి!

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో… ఇక ఆలస్యం చేయడం ఏమాత్రం సరైంది కాదనే సృహ చంద్రబాబు తెచ్చుకోవాలి. ఎన్నికల సందడి అయిపోయింది.. జరిగిందేదో జరిగింది.. ఇకనైనా బాబు కళ్లు తెరవాలి. అంతకంటే ముందు ఆత్మవంచన మాటలు మానుకోవాలి! వాస్తవాలు గ్రహించేస్థాయికి పరిపక్వత పొందాలి!

అలాకానిపక్షంలో చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ పతనం పరిపూర్ణం అవ్వడం గ్యారెంటీ అనేవిషయం.. పార్టీ మొత్తం కాలగర్భంలో కలిసిపోద్దన్న విషయం మరిచిపోకూడదు!

– CH Raja

Read more RELATED
Recommended to you

Latest news