చంద్రబాబు సొంతూరు నారావారిపల్లిలో వైసీపీ విజయం

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఊహించని షాక్‌ తగిలింది. ఆయన సొంత నియోజక వర్గమైన కుప్పం లో ఘోర పరాభం ఎదురైంది. ఇవాళ జరుగుతున్న జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో…. కుప్పం మండలం లో 17 ఎంపీటీసీల్లో వైయస్సార్‌సీపీ విజయం సాధించింది. అటు 2 ఎంపీటీసీలకు మాత్రమే టీడీపీ పరిమితం అయింది.

chandrababu naidu ys jagan

అంతే కాదు… నారావారిపల్లి ఎంపీటీసి సైతం కోల్పోయింది టీడీపీ… టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధరం పై వైసీపీ పార్టీ అభ్యర్థి రాజయ్య ఏకంగా 1347 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. ఇక తెలుగు దేశం అభ్యర్థి గంగాధరానికి కేవలం 307 ఓట్లు మాత్రమే వచ్చాయి. అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ పార్టీ అత్యధిక స్థానా ల్లో విజయం సాధిస్తోంది. కాగా… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లోని జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ మరియు మరియు పరిషత్‌ ఛైర్మన్ల ఎన్నిక కు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. దీంతో ఈ నెల 24 న ఎంపీపీ ల ఎన్నిక మరియు ఈ నెల 25 వ తేదీన జడ్పీ ఛైర్మన్ల ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ లో పేర్కొంది.