మంచు మోహన్ బాబు వారసుడిగా మంచు మనోజ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక ఎన్నో సినిమాలలో హీరోగా నటించినప్పటికీ స్టార్ హీరో ఇమేజ్ ను అయితే సొంతం చేసుకోలేకపోయారు. ఎప్పటినుంచో మంచు మనోజ్ రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.. అయితే సరైన సమయం కోసం ఆయన ఆగాల్సి వచ్చింది అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సమయం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఒక రాజకీయ పార్టీలో చేరబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి మంచు మనోజ్ సామాజిక అంశాలపై ఎక్కువగా మాట్లాడతారు.. సాయిధరమ్ తేజ్ కి ఆక్సిడెంట్ అయిన సమయంలో సింగరేణిలో కూడా ఒక బాలిక మీద అత్యాచారం జరిగింది. అయితే మీడియా కేవలం స్టార్ హీరో కాబట్టి సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ని మాత్రమే ఫోకస్ చేస్తే.. మనోజ్ బాలికకు జరిగిన అన్యాయాన్ని కవర్ చేయండి అంటూ మీడియాకు విజ్ఞప్తి చేశారు.
ఇలా చేసి మంచు మనోజ్ సామాజిక బాధ్యత కలిగిన హీరోగా ఒక మెట్టు ఎక్కేశారు. మా ఎలక్షన్స్ సమయంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ను కలిసి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. దీంతో జనసేనలో చేరుతారు అనే వార్తలు వచ్చాయి. కానీ స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా టిడిపిలో చేరుతారని వార్తలు వస్తున్నాయి. అది కూడా చంద్రగిరి నియోజకవర్గంలో నుంచి టీడీపీ తరఫున మంచు మనోజ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే ఎన్నికలు జరిగే వరకు ఎదురు చూడాల్సిందే.
ఇకపోతే 2019లో తన భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చిన తర్వాత మనోజ్ ఒంటరిగా ఉంటున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన టీడీపీ పార్టీ నేత భూమా నాగిరెడ్డి కూతురు భూమ మౌనిక రెడ్డి తో లవ్ లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు రావడంతో త్వరలోనే ఈ వార్తలకు క్లారిటీ ఇస్తానని మంచు మనోజ్ తెలిపారు.