మానిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్.. రాష్ట్ర ఏర్పాటులో అమిత్ షా ఎక్కడున్నాడంటూ.

-

దశాబ్దాల కల, ఎంతో మంది ప్రాణ త్యాగం ఇలా ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పడింది. తొలి, మలి ఉద్యమాలతో తెలంగాణ ప్రజలను ఏకం చేసి కేంద్రం మెడలు వంచి మరీ తెలంగాణ సాధించుకున్నాం. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దశాబ్ధాలుగు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలకు చరమగీతం పాడింది. విద్యార్థులు, ప్రజలు, కార్మికులు, రైతులు, రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు ఇలా అంతా కలిసి తెలంగాణను సాధించుకున్నారు. నేటితో తెలంగాణ 8వ ఆవిర్బావ దినోత్సవం జరుపుకుంటోంది.

తాజాగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యహహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. ‘‘ తెలంగాణ ఏర్పాటు దినోత్సవం నాడు చరిత్రను మరిచిపోవద్దని అప్పటి కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం, సుశీల్ కుమార్ షిండే చేస్తున్న తెలంగాణ ప్రక్రియ ప్రకటనలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇదే సమయంలో అమిత్ షా ఎక్కడంటూ ప్రశ్నించారు. అమిత్ షా ఎక్కడ ఉన్నారు..? హత్య కేసులో జైలుకు వెళ్లి బెయిల్ లో ఉన్నాడంటూ ట్వీట్ చేశాడు.

 

.

Read more RELATED
Recommended to you

Latest news