కేజ్రీవాల్‌పై మనీశ్‌ సిసోడియా సంచలన వ్యాఖ్యలు.. చంపేందుకు కుట్ర చేస్తున్నారు

ఢిల్లీలో రాజకీయం వేడెక్కింది. కేంద్ర దర్యాప్తు సంస్థల దర్యాప్తులతో రాజకీయం మరింత హీటెక్కిస్తోంది. అయితే.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను చంపేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ మున్నిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని చెప్పారు. ఢిల్లీ బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ నేతృత్వంలో ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు మనీశ్ సిసోడియా. కేజ్రీవాల్ పై దాడి చేయాలని ఇప్పటికే తన గూండాలకు మనోజ్ తివారీ బహిరంగంగా చెప్పారని… ఇప్పటికే పక్కా ప్లాన్ ను సిద్ధం చేశారని అన్నారు. ఇలాంటి కుట్రపూరిత రాజకీయాలకు ఆప్ భయపడదని చెప్పారు. బీజేపీ కుట్రలకు ప్రజలే సమాధానం చెపుతారని అన్నారు. కేజ్రీవాల్ గురించి మనోజ్ తివారీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సిసోడియా ఈ ఆరోపణలు చేశారు.

What next for Manish Sisodia, raided over Delhi liquor policy? - India Today

అంతులేకుండా కొనసాగుతున్న అవినీతి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీకెట్లను అమ్ముకోవడం, రేపిస్టులతో స్నేహం, జైల్లో ఆప్ మంత్రికి మసాజులు వంటి పరిణామాల పట్ల ఆప్ కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారని… కేజ్రీవాల్ భద్రతపై తనకు ఆందోళనగా ఉందని మనోజ్ అన్నారు. ఇప్పటికే ఆప్ ఎమ్మెల్యేలను ప్రజలు చితకబాదిన ఘటనలను కూడా చూశామని… ఇలాంటి అనుభవం ఢిల్లీ ముఖ్యమంత్రికి ఎదురు కాకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సిసోడియా కౌంటర్ ఇచ్చారు.