లేరు.. ఇక రారు.. అనుకున్న మావోయిస్టులు వస్తూనే ఉన్నారు. వాళ్ల పని వాళ్లు చేస్తూనే ఉన్నారు. ఇప్పటిదాకా కేవలం అటవీ ప్రాంతానికే పరిమితం అయిన మావోల ప్రభావం క్రమేనా మైదాన ప్రాంతాలకు విస్తరిస్తుందా? నిజంగా మావోయిస్టులు ఆ ప్రయత్నాల్లో ఉన్నారా..? దీనికోసం యాక్షన్ టీమ్ లను సిద్ధం చేస్తున్నారా..? అంటే కొట్టి పారేయలేని పరిస్థితి ఉంది. కారణం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుర్నపల్లి పంచాయతీకి చెందిన ఉపసర్పంచ్ ను మావోయిస్టులు చంపేశారు.
పోలీసులకు ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్నాడని అనుమానంతో ఉప సర్పంచ్ రాముడును మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఈ మేరకు మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని వారు లేఖలో హెచ్చరించారు. నిన్న రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా ఒక వ్యక్తి వచ్చి రాములను బయటకు తీసుకువెళ్లాడు. నిర్మానిష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి రాములును హతమార్చారు. కుటుంబ సభ్యులు ప్రాధేయపడిన వినిపించుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.