స్టార్ టెన్నిస్ ప్లేయర్ మరియా షరపోవా శుభవార్త చెప్పింది. త్వరలోనే టెన్నిస్ స్టార్ షరపోవా తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా.. మంగళ వారం రోజున తన 35 వ పుట్టిన సందర్భంగా ఆమె ప్రకటన చేశారు. సోషల్ మీడియాలో ఈ వార్తను షేర్ చేశారు షరపోవా. ఇన్ స్టాగ్రామ్ లో తన 4.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ తో ఈ శుభవార్తను తెలిపారు.
మరియా షరపోవా బీచ్ లో నిలబడి నవ్వుతున్న ఈ ఫోటోనను షేర్ చేస్తూ… విలువైన ప్రారంభం. ఇద్దరం పుట్టిన రోజు కేక్ తినడం ఎప్పుడూ.. నా ప్రత్యేకత. అని పేర్కొన్నారు షరపోవా. 2020 లో టెన్నిస్ నుంచి రిటైర్ అయిన షరపోవా తన కెరీర్ లో రష్యన్ తరఫున పొటీ చేశారు. అయితే.. కెరీర్ గ్రాండ్ స్లామ్ గెలిచిన రష్యన్ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. షరపోవా యువ టెన్నిస్ ప్రాడిజిగా దేశానికి వచ్చినప్పటి నుంచి యునైటెడ్ స్టేట్స్ లో నివసిస్తున్నారు. కాగా.. గతంలో… ప్రపంచ నంబర్ వన్ గా షరపోవా ఉన్న సంగతి తెలిసిందే.