మా పెళ్లికి రావాలంటూ.. ఆర్మీకి పెళ్లి పత్రిక

-

జీవితంలో జరిగే కార్యక్రమాల్లో పెళ్లి చాలా ముఖ్యమైంది. అయితే పెళ్లి చేసుకోవడంలో ఒక్కొరిది ఒక్కోరకం. అయితే.. తాజా ఓ జంట తమ పెళ్లిపత్రికను ఆర్మీకి పంపింది. వివరాల్లోకి వెళితే… ‘మీ ధైర్యసాహసాల వల్లే మేమిక్కడ సంతోషంగా జీవిస్తున్నాం.. ఇప్పుడు ఒక్కటవబోతున్నాం.. ఇలాంటి ఆనంద సమయంలో మీరు మా చెంత ఉండాలి’ అంటూ కేరళకు చెందిన ఓ యువజంట భారత సైన్యానికి పెండ్లి పత్రిక పంపించింది. ఆ కార్డు అందుకున్న ఆర్మీ అధికారులు కూడా అంతే సంతోషంగా జవాబిచ్చారు. కలకాలం కలిసి ఉండాలంటూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లికి పిలిచినందుకు ధన్యవాదాలు చెబుతూ సదరు పెండ్లి పత్రికను ఆర్మీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. కేరళకు చెందిన రాహుల్, కార్తీకలు ఈ నెల 10న వివాహం చేసుకున్నారు.

We are getting married happily because of you: Kerala couple invites Indian  Army to their wedding

ఈ వివాహానికి ఆ జంట ఆర్మీని ఆహ్వానించింది. తమ పెండ్లి పత్రికను ఆర్మీకి పంపించింది. ‘ప్రియమైన హీరోలకు..’ అంటూ సైనికులను సంబోధిస్తూ.. మీ ప్రేమ, దేశంపై మీకున్న భక్తి, విధినిర్వహణలో మీరు చూపించే సాహసానికి మేమెంతో రుణపడి పోయామని రాహుల్, కార్తీక పేర్కొన్నారు. ‘సరిహద్దుల్లో కాపలా కాస్తూ మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతున్నందుకు, మా జీవితాలను సంతోషంగా ఉంచుతున్నందుకు మీకు ధన్యవాదాలు. మా పెళ్లికి హాజరై మమ్మల్ని దీవించండి’ అంటూ ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Latest news