రూ.4 లక్షల లోపే ఆల్టో కె10 మోడల్ కారు.. ఫీచర్స్ అదుర్స్

-

మారుతీ సుజుకీ కంపెనీ ఆల్టో సిరీస్​లో మరో కొత్త మోడల్​ను లాంచ్ చేసింది. చిన్నకార్లలో అత్యంత ఆదరణ కలిగిన మారుతీ ఆల్టోను 22 క్రితం మార్కెట్​లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మారుతీ సుజుకీ ఆల్టో కె10 మోడల్​ను లాంఛ్ చేశారు. దీని ధర రూ.3.99 లక్షలు.

మారుతీ సుజుకీ కె10 మోడల్​లో ఆల్టో పాత మోడల్​తో పోలిస్తే అనేక మార్పులు చేశారు. కారు బయట, లోపల డిజైన్​ను మార్చారు. అలాగే సరికొత్త ఫీచర్లతో మార్కెట్​లోకి మారుతీ సుజుకీ కె10ను ప్రవేశపెట్టారు. పెట్రోల్ ట్యాంక్​లో మార్పులు చేశారు. అలాగే లైట్​వెయిట్ హార్ట్​పీస్ ప్లాట్​ఫామ్​ను తీసుకొచ్చారు. ఆల్టో కె10 కారు ప్రారంభ ధర రూ.3.99 లక్షలు. హైఎండ్ వేరియంట్ ధర రూ.5.99 లక్షలు. మారుతీ ఆల్టో కె10 మోడల్ మొత్తం 6 రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

సాలిడ్ వైట్, సిల్కీ సిల్వర్, గ్రానైట్ గ్రే, సిజ్లింగ్ రెడ్, స్పీడీ బ్లూ, ఎర్త్ గోల్డ్ రంగుల్లో ఆల్టో కె10 కార్లు మార్కెట్​లోకి అందుబాటులోకి వచ్చాయి. ఇంజిన్ ట్యాంక్ సామర్థ్యం 27 లీటర్లు. ఈ కారు లీటరు​కు 24.90 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news