Breaking : స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లలో మాస్కులు తప్పనిసరి

-

ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసిన కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. ఇప్పటికే చైనా కరోనా విజృంభన కొనసాగుతోంది. చైనాతో పాటు పలు దేశాల్లో కరోనా పడగవిప్పుతోంది. అయితే ఇటీవల చైనా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కూడా కరోనా సోకినట్లు నిర్థారణ కావడంతో ఆ వ్యక్తి ఐసోలేషన్‌కు తరలించి.. రక్తనామునాలను జీనోమ్‌ సీక్వెన్సికి పంపించారు. అయితే.. దేశంలో మరోసారి కరోనా వ్యాప్తి పట్ల ఆందోళనలను నెలకొన్నాయి. ఒమిక్రాన్ బీఎఫ్-7 సబ్ వేరియంట్ తో ముప్పు ఉందన్న నిపుణుల హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వం కొవిడ్ నిబంధనలను మళ్లీ తెరపైకి తెచ్చింది. స్కూళ్లు, కాలేజీలు, థియేటర్లలో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి కేశవ సుధాకర్ వెల్లడించారు.

Double Masking: How, Why, and When You Should Double Up on Face Masks

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్ లు, రెస్టారెంట్లు, బార్లలో కచ్చితంగా మాస్కులు ధరించాలని, నూతన సంవత్సర వేడుకలు రాత్రి ఒంటి గంట లోపే ముగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వేడుకలు జరిగే చోట పరిమితికి మంచి జనం గుమికూడరాదని అన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని మంత్రి కేశవ సుధాకర్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news