వైరల్‌గా మారిన ఖుషి ట్రైలర్

-

ప్రస్తుతం రీరిలీజ్‌ సినిమాల ట్రెండ్ నడుస్తోందనే చెప్పాలి. పాత సినిమాలను నేటి టెక్నాలజీకి మార్పులను జోడించి, మరలా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. అలాగే థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ క్రమంలో టాలీవుడ్ మరో స్టార్ హీరో సినిమా ఈ లిస్టులో చేరింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆల్ టైమ్ హిట్ లలో ‘ఖుషి’ ఒకటి. తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్‌‌జే సూర్య 2001లో రూపొందించిన ఈ సినిమా సెన్సేషన్ అయ్యింది. పవన్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పవన్‌కు జోడీగా భూమిక నటించగా.. సపోర్టింగ్ రోల్‌లో శివాజీ, అలీ కనిపించారు. మణిశర్మ మ్యూజిక్ సినిమాకు స్పెషల్ ఎస్సెట్‌గా నిలిచింది.

Kushi Re-Release Trailer | Pawan Kalyan, Bhumika Chawla | SJ Suryah | Mani Sharma | Dec 31st Release - YouTube

పాటలు ఇప్పటికీ జనం పాడుకుంటూ ఉంటారు. హీరోహీరోయిన్ల రొమాంటిక్ సీన్స్, ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు, కెమిస్ట్రీ.. ఇలా అన్నీ కలిపి ‘ఖుషి’ని క్లాసిక్ మూవీగా మార్చేశాయి. ప్రస్తుతం ఇలాంటి ఓల్డ్ క్లాసిక్ మూవీస్ ఫ్యాన్స్ కోసం రీరిలీజ్ అవుతోంది. ఈ నేపధ్యంలో ఇపుడు ‘ఖుషి’ మేకర్స్ రీరిలీజ్ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ లో వైరల్ గా మారింది.

ఈ సినిమాను డిసెంబర్‌ 31న రీరిలీజ్ చేస్తున్నారు. . ‘ఖుషి’ సినిమాను కూడా టెక్నాలజీ హంగులు చేర్చి, 4కే రిజల్యూషన్‌, 5.1 డాల్బీ ఆడియోతో రీరిలిజ్ చేయనున్నారు. దీంతో పవన్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఖుషి చిత్రం ఓ రీమేక్. తమిళ స్టార్ విజయ్, జ్యోతిక జంటగా ఎస్‌జే సూర్య మొదట తమిళ్‌లో ఈ సినిమాను తెరకెక్కించాడు. అక్కడ సక్సెస్ కావడంతో తెలుగులో ఆయనే పవన్‌తో తీశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news