మసాలా కమర్షియల్ హంగులు లేవు! ఓటీటీ లో సూపర్ హిట్.!

-

తెలుగు సినిమాల లో చాలా మంది కొత్త కథలు రావటం లేదని విమర్శలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది అన్నీ మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు చూడటానికి అలవాటు పడితే మేము ఏమిచేస్తాం అని కొంత మంది డైరెక్టర్స్ కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మసాలా సినిమాలు చూసే వారు 80%ఉంటే కొత్త కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చూసే వారు 20%మాత్రమే ఉన్నారు.

ఇక మసాలా కమర్షియల్ హంగులకు పోకుండా, కథ డిమాండ్ బట్టి పాత్రలు ఎంచుకొని తీసిన సినిమా మసూద. తిరు మరియు సంగీత కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సాయి కిరణ్ దర్శకత్వం వహించాడు. మసూద చూసిన వాళ్లు అందరూ బాగుంది అన్నారు. రేటింగ్స్ కూడా బాగానే ఉన్నా కలెక్షన్స్ మాత్రం గాట్టిగా రాలేదు. ఎందుకంటే ఆ మూవీ లో మసాలా లేదు.

అందుకే థియేటర్స్ నుండి తొందరగా తీసేసిన గాని ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అయ్యి  మసూద మంచి విజయాన్ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది. ఆహా ఓటీటీ ద్వారా రిలీజ్ అయిన ఈ మూవీ వండర్స్ క్రియేట్ చేస్తోంది. ప్రేక్షకులు మసూద సినిమాను విపరీతంగా చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే టిక్కెట్స్ గోల, పాప్ కార్న్ గోల పోల్యూషన్ గోల లేదుకదా.

Read more RELATED
Recommended to you

Exit mobile version