మే 29 ఆదివారం రాశి ఫలాలు..

-

మే 29 ఆదివారం రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం…

మేషం : ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి,ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. కీలక వ్యవహారాలలో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు..వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.దైవదర్శనాలు చేస్తారు.

వృషభం : వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి. వ్యాపారపరంగా సొంత ఆలోచన చేసి ఇబ్బంది పడతారు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.కొత్త ఋణ ప్రయత్నాలు విఫలం అవుతాయి..ఈరోజు అంత మంచి ఫలితాలు ఉండవు..

మిథునం : దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతుంది. ఆర్థికంగా కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది..విందు వినోద కార్యక్రామాలలో పాల్గొంటారు.

కర్కాటకం : ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. సంతాన విద్యా సంబంధిత కార్యక్రమాలకు హాజరవుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు.సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు..

సింహం : కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆటంకాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని విజయం సాధిస్తారు. భూ సంబంధ క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి.కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు..

కన్య : సోదరులతో స్థిరాస్థి వివాదాలు కలుగుతాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. భాగస్వామి వ్యాపారాలలో కొద్దిగా నష్టాలు ఉంటాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగినా మొత్తానికి పూర్తి చేస్తారు.

తుల : జీవిత భాగస్వామి ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఏదైనా పని మొదలు పెట్టి మధ్యలో నిలిపివేస్తారు. బంధు మిత్రుల నుంచి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి..

వృశ్చికం : శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తులు నూతన పదవులు పొందుతారు. బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు..విందు వినోద కార్యక్రామాలలో పాల్గొంటారు.దైవదర్శనాలు చేస్తారు. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు.

ధనస్సు : సంతాన ఆరోగ్య విషయాలపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరమైన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమకు స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. ఋణ ఒత్తిడి పెరిగి మానసిక సమస్యలు ఉంటాయి. ధనపరమైన ఒడిడుకులు కలుగుతాయి.

మకరం : కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది సంతాన వివాహ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులకు చేసే ప్రయత్నాలు ఫలించవు. చిన్ననాటి మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఉద్యోగమున పనిభారం పెరుగుతుంది.

కుంభం : ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుండి ఊహించని విధంగా సహాయం లభిస్తుంది. సంతానం, పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మానసికంగా ఉత్సాహంగా వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.ఈరోజు అన్నీ మంచి ఫలితాలు కలుగుతాయి.

మీనం: మొండి బాకీలు వసూలు కావడం ఆలస్యం అవుతుంది. విలాస వస్తువుల కోసం ధనవ్యయం చేస్తారు. స్థిరాస్థి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో జాగ్రత్త వహించాలి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి సమస్యలు కలుగుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.బంధువులతో సంతోషంగా ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version