ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కేసీఆరే : మంత్రి ప్రశాంత్‌ రెడ్డి

-

తెలంగాణలో రాజకీయం ప్రస్తుతం మునుగోడు చుట్టే తిరుగుతోంది. రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ రాజకీయాలు సైతం మునుగోడు ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. మునుగోడులో జెండా ఎగురవేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. ప్రత్యర్థులను దాటి ముందుకు వెళ్లేందుకు ఇంటింటి ప్రచారాలు, హామీలు గుప్పిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నాగారంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కేసీఆరే. డబ్బులకు అమ్ముడు పోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యక్తిని తరిమికొట్టాలి అని ఆయన అన్నారు. కొయ్యలగూడెం నుండి పాలపాడు వరకు తారు రోడ్డు వేయించే బాధ్యత నాది. కుల సంఘాలకు భవనాలు నిర్మించే బాధ్యత నాది. అని ఆయన హామీ ఇచ్చారు.

Munugode By Poll Minister Vemula Prashanth Reddy Comments On BJP Komati  Reddy Rajagopal Reddy Contract In Jharkhand DNN | Minister Vemula Prashanth  Reddy : బొగ్గుగని కాంట్రాక్ట్ ఆశచూపి రాజీనామా, రాజగోపాల్ ...

ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి అదేవిధంగా కెసిఆర్ చేస్తున్నారు. అభివృద్ది చేసే గుర్తు టీఆర్ఎస్ కారు గుర్తు. అమ్ముడు పోయిన గుర్తు బీజేపీ పువ్వు గుర్తు. మునుగోడు ప్రజలు అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డిని అసహ్యించు కుంటున్నారు. ఈసీ ని అడ్డం పెట్టుకొని బీజేపీ కుట్రపూరిత రాజకీయం చేస్తోంది. ఈసీ వైఖరి అభ్యంతరకరం. 2011లో నిషేధించిన రోడ్డు రోలర్ గుర్తు మళ్లీ ఎలా కేటాయిస్తారు..? మునుగోడు ప్రజలు చైతన్య వంతులు… అన్ని గమనిస్తున్నారు…బీజేపీ కి కర్రు కాల్చి వాత పెట్టడానికి రెడీగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news