గుండెల నిండా ధైర్యం లేదు… మెగా ఫ్యామిలీకి డైరెక్ట్ సీఎం పోస్టే కావాలా?

-

రాజకీయాల్లోకి రావడం, వచ్చిన వెంటనే సీఎం అయిపోవడం అనేది నాటి పరిస్థితుల రీత్యా నందమూరి తారకరామారావుకి సెట్ అయ్యింది కానీ… అనంతరం తెలుగు రాజకీయాల్లో సీఎం చైర్ ఎన్నికవారంతా అన్ని రకాల కష్టాలు పడి, అన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొని, డక్కామొక్కీలన్నీ తిని అనంతరం ఆ అనుభవంతో, ఆ కష్టాల ఫలితంగా సీఎం చైర్ ఎక్కారు! అయితే… మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు మాత్రం నేరుగా సీఎం చైర్ కోరుకుంటారనే కామెంట్లు బలపడుతున్నాయి!

pawan-kalyan

అవును… రాజకీయాల్లోకి రావడం ఆలస్యం… పార్టీ పెట్టడమే లేటు… అనంతరం డైరెక్టుగా సీఎం చైర్ ఎక్కేయ్యాలనే ఆలోచన చేస్తున్నట్లున్నారు మెగా ఫ్యామిలీ హీరోలు! ఎవరు అవునన్నా కాదన్నా నాడు చిరంజీవి స్టామినాతో పోలిస్తే పవన్ తక్కువనే చెప్పాలి. అప్పటికింకా చిరుని ఒక సామాజిక వర్గానికి చెందిన నేతగా మాత్రమే జనం చూడలేదు. ఫలితంగా ఆశించినంత రాకపోయినా.. నిలబడగలిగేటన్ని సీట్లైతే వచ్చాయి! తమిళనాడులో విజయ్ కాంత్ అందుకు ఆదర్శం కూడా! కానీ ఈలోపే చిరు తొందరపడ్డారు… తాను ఆశించిన సీఎం ఛైర్ రాకపోయే సరికి… కాంగ్రెస్ లో కలిపేశారు!

ప్రజలకోసం కాదు తాను రాజకీయాల్లోకి వచ్చింది.. ముఖ్యమంత్రి హోదా కోసం వచ్చాము అన్న రేంజ్ లో క్లారిటీ ఇచ్చేశారు. పోరాడే సత్తువ, ప్రజా బలం, అభిమానుల మద్దతు ఉన్నా కూడా… మడమ తిప్పారు – మెర్జ్ చేశారు! దాంతో… చిరు ఇంతకాలం కష్టపడి వేసుకున్న పునాదులు పేకమేడల్లా కూలిపోయాయి. ఇక అనంతరం ఆవేశంగా రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కల్యాణ్. “ఇల్లేమో దూరం…” అంటూ మొదలెట్టారు. దీంతో మొదట్లో పవన్ ని కొంతమంది జనం సీరియస్ గానే తీసుకున్నారు.

అయితే…ఆ సీరియస్ నెస్ ని నిలుపుకోవడంలో.. కాపాడుకోవడంలో పవన్ పుష్కలంగా ఫెయిల్ అయ్యారు! ఎప్పుడైతే ప్రజలతరుపున పోరాడతానని చెప్పి అధికారపక్షంతో దోస్తీ కట్టారో నాడే… జనసేన పునాదులకు బీటలు మొదలైపోయాయి. అయితే… అనంతరం టీడీపీతో విభేదించినా.. ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయినా… ఉన్న ఒక్క ఎమ్మెల్యేని కాపాడుకోవడంలో విఫలమయ్యారు. ఒక్క ఎమ్మెల్యే ఉన్న పర్లేదు.. తన అభిప్రాయాన్ని, తన పార్టీ అభిప్రయాలను అసెంబ్లీలో వినిపించే గొంతుక దొరికిందని సంతోష పడలేదు. తాను ఓడిపోయాను, తన పార్టీ నేలంటేసిందనే బాదలోనే ఉండిపోయారు!

ఫలితంగా అభిమానులు ఎన్నో ఆశలుపెట్టుకున్న పార్టీని.. బీజేపీతో పొత్తు కలిపారు. ఇప్పుడు వారి ఆశలన్నీ వమ్ము చేస్తూ… బీజేపీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మిగిలారు. పోరాడే వయసుంది.. సత్తువ ఉంది.. తెగువ ఉంది.. మద్దతిచ్చే వర్గమూ ఉంది.. తోడు నడిచే జనసైన్యమూ ఉంది.. కానీ ఒంటరిగా నడవగలిగే ధైర్యం మాత్రం పవన్ కు లేదు! అధికార యావ తప్ప..!! నిజంగా పవన్ కు ఒక్క సీటే వచ్చిన పర్లేదు… నిజంగా నిలబడి ఉంటే.. పోరాటమే ఊపిరిగా నడిచి ఉంటే.. భవిష్యత్తులో కచ్చితంగా నిలిచేవారు!! కానీ… నిలవలేకపోతున్నారు!!

 

Read more RELATED
Recommended to you

Exit mobile version