మెగా కొడలు, ఆపోలో ఆస్పత్రలు వైస్ చైర్ పర్సన్ ఉపాసన దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయింది. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా తెలిపింది. అలాగే పీఎం మోడీ తో ఉన్న ఫోటో ను కూడా ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఇండియన్ ఎక్స్ పో 2020 లో భాగం గా పీఎం మోడీ తో సమావేశం అయ్యానని తెలిపింది. పీఎం మోడీని తో సమావేశం కావడం గౌరవం గా భావిస్తున్నాని తెలిపింది. ప్రధాని యోగా క్లాసులు తనకే చెప్పానని.. అది ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ట్విట్టర్ లో క్యాప్సన్ రాసుకు వచ్చింది.
అలాగే ఎక్స్ పో 2020 ద్వారా అనేక పరిశోధనలు చేస్తున్నారని అన్నారు. వాటి గురించి పీఎం మోడీతో కాసెపు చర్చించానని తెలిపారు. ఎక్స్ పో 2020 లో భాగం గా చంద్రుడి దక్షిణ ద్రువం పై నీరు ఉందా.. అని చంద్ర యాన్ కార్యక్రమం చేశారని తెలిపింది. వీటి తో పాటు అనేక ఆరోగ్య పద్ధతులు, మహిళా సాధికారత వంటి అనేకమైన పరిశోధనలు జరిగాయని తెలిపింది. అలాంటి ఎక్స్ పో కార్యాక్రమాల వద్ద కు పిల్లలను తీసుకెళ్లాలని అంది. అలాగే కరోనా నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటిస్తు, మాస్క్ లు ధరించాలని సూచించింది.
It was an absolute honour to meet 📸 @PMOIndia ji at the @IndiaExpo2020
It was amazing to see innovation, preventive healthcare, women empowerment & preservation of culture to be the main focusThe power of technology gives us opportunity,we must use it wisely@expo2020dubai pic.twitter.com/EYYwRVK2Qv
— Upasana Konidela (@upasanakonidela) December 22, 2021