మెగా అల్లుడుగా కళ్యాణ్ దేవ్ కి మొన్నటి వరకు మంచి గుర్తింపు లభించింది. కానీ ఎప్పుడైతే చిరంజీవి కూతురు శ్రీజ తో విడాకులు తీసుకున్నాడో ఇక అప్పటినుంచి అతడికి గడ్డు కాలం మొదలైందనే చెప్పాలి. ఇక మెగా అభిమానులు కూడా కళ్యాణ్ దేవ్ కి సపోర్ట్ చేయడం లేదు. ఇక ఈ నేపథ్యంలోనే ఆయనపై విపరీతంగా రూమర్స్ క్రియేట్ చేస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఏ ఒక్క అమ్మాయితో కలిసి ఫోటో దిగిన సరే ఆ అమ్మాయితో సంబంధం కట్టేస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం శ్రీజ .. కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకొని విడిపోబోతున్నారు అంటూ బాగా వార్తలు వినిపించాయి. కానీ ఎవరూ కూడా ఈ విషయంపై స్పందించలేదు . కళ్యాణ్ దేవ్ కూడా ఎక్కడో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ తన ఫ్యామిలీకి దూరంగా ఉండటంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు.
ఇదిలో ఉండగా తాజాగా.. సోషల్ మీడియాలో కళ్యాణ్ దేవ్ మూడవ పెళ్లికి సిద్ధమయ్యారు అంటూ వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ కారణంగానే ఈ వార్త నిజం అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇక కళ్యాణ్ దేవ్ తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్టులో ఒక అమ్మాయి ఫోటో షేర్ చేస్తూ.. నా లైఫ్ ని మార్చేసిన కలల రాణి అని రాసుకొచ్చాడు. దీంతో మూడో పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఇకపోతే కళ్యాణ్ దేవ్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజను ఆయన రెండో వివాహం చేసుకున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే మూడవ పెళ్లి అనే వార్తలు కూడా బాగా వైరల్ అవుతున్నాయి.
అయితే కళ్యాణ్ దేవ్ పక్కన వున్న అమ్మాయి ఎవరు అని ఆరా తీయగా.. ఆమె పేరు వర్ణిక రాథోర్ అని గుర్తించారు. ఈమె తో పాటు మరొక అమ్మాయిని కూడా గుర్తించారు . ఆ అమ్మాయి పేరు అంకిత. వీరిద్దరూ కూడా హీరోయిన్స్ కం మోడల్స్ అని తెలియడంతో కళ్యాణ్ వివాహం చేసుకోలేదని.. కేవలం సినిమా విషయంలో మాత్రమే కలిసి ఫోటో దిగారు అన్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.