ఇది కదా మెగాస్టార్ అంటున్న చిరు ఫ్యాన్స్..!!

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య’ సినిమా 13 తేదీన థియేటర్స్ లో విడుదల అయ్యి సంచలన వసూళ్ళు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర లో నటించారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు.ఈ సినిమా తో  చిరంజీవి వింటేజ్ లుక్ తో అదరగొట్టాడు మాస్ ఎలివేషన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్, సాంగ్స్ అదిరిపోయాయి.

ఇప్పటికీ కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది.తాజాగా 10 రోజులకు 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి మంచితనం గురించి అందరికి తెలిసిందే. తన ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక తన దగ్గరకు వచ్చిన, వారిని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న వారికి తాను ఎప్పుడూ సహాయం చేస్తూనే వుంటారు.

అలాగే తాజాగా టాలీవుడ్ సీనియర్ టెక్నీషియన్ అయినటువంటి సినిమాటోగ్రాఫర్ దేవరాజ్ కి 5 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు. 80- ,90 లలో  ఉన్న ఆల్ మోస్ట్ అందరి స్టార్ హీరోలు ఒక్క తెలుగే కాకుండా తమిళ్ హిందీ కన్నడ, మళయాళ బెంగాలీ ఎన్నో భాషల్లో 300 కి పైగా సినిమాలకు తాను సినిమాటోగ్రాఫర్ గా చేశారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేదని  చిరంజీవి కి తెలియడం వెంటనే వారిని తన ఇంటికే ఆహ్వానించి ఆతిధ్యం ఇచ్చి ఆ 5 లక్షల చెక్కు ని అందించారు. అంతే కాకుండా తనకి ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దానితో చిరంజీవి ఫ్యాన్స్ ఇది కదా మెగాస్టార్ అని కామెంట్స్ పెడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news