హైదరాబాద్ లో తన విలువైన ఆస్తులను అమ్మేసిన మెగాస్టార్ చిరంజీవి.. కారణం అదేనా ?

-

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికాలు తీసుకునే హీరోలలో ఒకడు మెగాస్టార్ చిరంజీవి.. రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన మూడు సినిమాలలో రెండు సినిమాలు వంద కోట్ల షేర్ మార్కుని అందుకొని మెగాస్టార్ చిరంజీవి స్టామినా ఎలాంటిదో నేటి తరం ప్రేక్షకులకు కూడా మరోసారి అర్థం అయ్యేలా చేసింది.. చిరంజీవి కి ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఆయనకీ ఒక్కో సినిమాకి గాను 40 నుండి 50 కోట్ల రూపాయిలు పారితోషికం ఇస్తారు దర్శక నిర్మాతలు.. ఇది నేటి తరం స్టార్ హీరోలతో సరిసమానమైన పారితోషికం అని చెప్పొచ్చు..

70 ఏళ్ళ వయస్సులో కూడా నేటి తరం స్టార్ హీరోలతో పోటీపడుతూ వాళ్ళతో సరిసమానమైన మార్కెట్ ని మ్యానేజ్ చెయ్యడం అంటే మాములు విషయం కాదు.. ఆ స్థాయి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ఫిలిం నగర్ లో ఉన్న తన ఆస్తులను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మీరు నమ్మగలరా?? కానీ నమ్మాలి.. ఎందుకంటే అదే నిజం కాబట్టి.. అసలు చిరంజీవి స్థాయి వ్యక్తికి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏమిటి.. ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది అనే విషయాలు ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే రెండు దశాబ్దాల క్రితం చిరంజీవి ఫిలిం నగర్ లోని ఒక భూమిని 30 లక్షల రూపాయలకు కొనుగోలు చేసాడు.. మంచి సెంటర్ లో ఉన్న ఫ్లాట్ ఇది.. మనకి తెలిసిందే హైదరాబాద్ లో ఇప్పుడు ఒక్క గజం భూమి విలువ ఏ స్థాయిలో పలుకుతుందో అనే విషయం.. ఒక్క అంకణం విలువ అక్కడ దాదాపుగా కోటి రూపాయిలు చేస్తుంది.. అయితే ఈ ఫ్లాట్ పై ఎప్పటి నుండో ఒక ప్రముఖ మీడియా సంస్థ కి చెందిన యజమానికి మక్కువ ఉంది..

చిరంజీవి ని ఆయన చాలా కాలం నుండి ఆ స్థలం తనకి అమ్మాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ వస్తూనే ఉన్నాడు.. కానీ చిరంజీవి మాత్రం అందుకు ఒప్పుకోలేదు.. ఎందుకంటే భవిష్యత్తులో ఆ స్థలం కోట్ల రూపాయిల విలువ చేస్తుందని చిరంజీవి కి తెలుసు కాబట్టి.. అందుకే ఎంత బ్రతిమిలాడినా ఆయన ఆ ఫ్లాట్ ని అమ్మలేదు.. అయితే ఇప్పుడు ఆ స్థలం విలువ అక్షరాలా 70 కోట్ల రూపాయిలు చేస్తుందట.. ఇంతకు మించి ఈ స్థలం విలువ ఇప్పట్లో పెరిగే సూచనలు కనిపించకపొయ్యేసరికి చిరంజీవి ఆ స్థలం ని ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఆ ప్రముఖ మీడియా సంస్థ అధినేత కి 70 కోట్ల రూపాయలకు అమ్మేసాడట.. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ఈ ఏడాది ఆయన నుండి వచ్చిన ఆచార్య సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో మన అందరికి తెలిసిందే.. చిరంజీవి సినిమాలు ఎంత పెద్ద ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా కూడా వీకెండ్ వరుకు అద్భుతమైన వసూళ్లను రాబడుతూ ఉండేవి..కానీ ఆచార్య సినిమా మాత్రం మొదటి రోజు నుండే ఓపెనింగ్స్ విషయం లో తడపడింది.. ఇక ఫుల్ రన్ సంగతి సరేసరి..

కేవలం 48 కోట్ల రూపాయిలు మాత్రమే వసూలు చేసి దాదాపుగా 85 కోట్ల రూపాయిల వరుకు బయ్యర్స్ కి నష్టాలను మిగిలించింది ఈ చిత్రం.. అలాంటి ఫ్లాప్ సినిమా తర్వాత ఆయన చేస్తున్న చిత్రం ‘గాడ్ ఫాదర్’.. మలయాళం లో సూపర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.. ఈ నెల 21 వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కాబోతుంది.. ఆచార్య ఫలితం తో డీలాపడిన మెగా ఫాన్స్ ని ఈ చిత్రం సంతృప్తి పరుస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news