రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి వాన దంచికొట్టింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఉరుములు, మెరుపులు మెరిశాయి. ఆ మెరుపులను చూసి నగర ప్రజలు ఓ వైపు ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఓ గంట పాటు వాన దంచి కొట్టడంతో నగరమంతా జలమయమైంది. నగర శివార్లలో కుండపోత వర్షం కురిసింది.
హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, సరూర్‌నగర్, చంపాపేట్, సైదాబాద్, వనస్థలిపురం, ఎల్బీనగర్, మన్సూరాబాద్, నాగోల్‌లో భారీ వాన పడింది. హైదరాబాద్ సెంట్రల్‌లో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరో రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని, అవసరమైతేనే ప్రజలు నివాసాల నుంచి బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.