మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు.. ఈ సారి ప్రధాని మోదీపైనే..

-

మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మేఘాలయ గవర్నర్ సత్యాపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా ప్రధానిపైనే గురిపెట్టారు. గతంలో కూడా పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. బీజేపీలో పార్టీలో పెద్దల తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రైతుల ఉద్యమ సమయంలో ఆయన ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. రైతులకు మద్దతుగా నిలిచారు గవర్నర్ సత్యపాల్ మాలిక్.

తాజాగా ఆయన మరోసారి సంచన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీనే టార్గెట్ చేశారు. గతంలో రైతు సమస్యలపై మాట్లాడటానికి వెళ్లినప్పుడు మోదీ చాలా అహంకారపూరితంగా మాట్లాడరని అన్నారు. రైతు ఉద్యమంలో రైతులు చనిపోతున్నారని చెప్పినప్పుడు.. రైతులు ఏమైనా నాకోసం చనిపోతున్నారా.. అని అన్నారని మాలిక్ తెలిపాడు. ఈ విషయమై తాను మోదీతో కొద్ది సమయం యుద్దమే చేశానని చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version