ఏపీలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించారు కేంద్ర జల సంఘం సభ్యులు. సిడబ్ల్యూసి డైరెక్టర్ కయ్యం మొహమ్మద్ నేతృత్వంలోని సభ్యులు ఎగువ కాపర్ డ్యాము ను పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు. కాగా గత నెలలోనే పోలవరం ప్రాజెక్టులో దెబ్బతిన్న డయాగ్రమ్ వాళ్ళను కేంద్ర బృందం పరిశీలించింది. ఎగువ కాపర్ డ్యాం, పవర్ హౌస్ ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులు, డయాఫ్రమ్ వాల్ ఎడమ ప్రధాన కాలువ కనెక్టివిటీ పనులపై ఆరా తీసింది.
అయితే తాజాగా ఆదివారం ఇటీవల ప్రాజెక్టుకు వచ్చిన వరద వల్ల గ్రామాలలోకి వచ్చి పంట పొలాలు ఆస్తి నష్టం సంభవించింది. దీనిపై కేంద్ర జల సంఘం సభ్యులు ఇవ్వాళ సందర్శించి ఎగువ ఆఫర్ డ్యామ్ ను పరిశీలించారు. అయితే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం అప్పటినుంచి ఆంధ్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రాజెక్టులో నిర్మాణాలను చేపడుతుంది.