మూవీ మొఘల్ డాక్టర్ డి.రామానాయుడి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేశ్..తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. జనాలను ఎంటర్ టైన్ చేయడంలో ముందుండటంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు వెంకటేశ్. ఇటీవల F3 ఫిల్మ్ తో జనాలను కడుపుబ్బ నవ్వించాడు వెంకీ.
జనాలను ఎంటర్ టైన్ చేయడమే ఉద్దేశంగా ప్రతీ సినిమా చేస్తానని వెంకటేశ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సంగతి అలా ఉంచితే.. అప్పట్లో వెంకటేశ్ నటించిన ‘త్రిమూర్తులు’ పిక్చర్ వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. ఇందులో ఒక పాట కోసం అప్పటి అగ్రతారలు అతిథులుగా వచ్చి నటించారు. కొద్ది సేపు ఆ పాటలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆ సంగతులు తెలుసుకుందాం.

‘నసీబ్’ అనే హిందీ మూవీని తెలుగులో ‘త్రిమూర్తులు’ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. టి.సుబ్బిరామిరెడ్డి ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేయగా, కె.మురళీ మోహన్ రావు దర్శకత్వం వహించారు. ఇక ఇందులో ‘ఒకే మాట..ఒకే బాట..’ అనే పాట స్పెషల్ గా తీయాలని మేకర్స్ భావించారు.
హిందీ చిత్రంలో ఒక పాటకు బాలీవుడ్ అగ్రతారలు గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో, హీరోయిన్స్ అందరినీ ఈ పాటలో కనిపించేలా చేయాలని డిసైడ్ అయ్యారు. అలా సుబ్బిరామిడరెడ్డి అందరి వద్దకు వెళ్లి మాట్లాడారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను కూడా ఇందులో భాగం చేయాలనుకున్నారు. కానీ, వారికి ఉన్న బిజీ షెడ్యూల్ వలన వారు భాగం కాలేకపోయారు.
ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రాకపోయినప్పటికీ పలువురు అగ్రతారలు ఈ పాటలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. విక్టరీ వెంకటేశ్ ఈ పాటకు చక్కటి అభినయం కనబర్చగా ఇందులో శోభన్‌బాబు, విజయశాంతి, కృష్ణ, విజయ నిర్మల, చిరంజీవి, కృష్ణం రాజు, శారద, బాలకృష్ణ, నాగార్జున, రాధిక, రాధ, జయమాలిని తో పాటు చంద్రమోహన్, మురళీ మోహన్ కనిపించారు.

అలా ఈ పాటలో ఏడుగురు హీరోలు, నలుగురు హీరోయిన్స్ కనిపించారు. ఇక ఈ చిత్రం థియేటర్ లో విడుదలైన క్రమంలో ఇంత మంది తారలను చూసేందుకు జనాలు థియేటర్ కు వచ్చారట.