జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రి అమర్‌నాథ్ సెటైర్ల వర్షం కురిపించారు. జనసేన పార్టీని నడపలేనని పవన్ చేతులెత్తేశారని హేళన చేశారు ఆయన. వైజాగ్ లో మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కాదని, అది జెండా సేన పేర్కొన్నారు. ప్రతీసరి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీ జెండా మోయడమే పవన్ కల్యాన్ పని అని హేళన చేశారు మంత్రి అమర్నాథ్. జనసైనికులు ఇక నుంచి జెండా కూలీలు అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేపట్టారు.
పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదని, ప్యాకేజ్ స్టార్ అని మొదటి నుంచి చెబుతున్నామన్నారు గుర్తుచేశారు. ఇప్పుడు అదే నిజమైందని, తాము చెబితే చెప్పులు చూపించిన పవన్.. ఇప్పుడేం చూపిస్తారని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్. పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిపోవడం అంటే మూడు పెళ్లిళ్లు చేసుకుని పిల్లలను కనేయడం అంత ఈజీ కాదని ఎద్దేవా చేశారు. 30 సీట్లు ఇస్తే ముఖ్యమంత్రి ఎలా అవుతారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పవన్ కళ్యాణ్ ను అడిగారు.