నిన్నటి వేళ బొత్స ఇంట వివాహ అనంతర వేడుక (రిసెప్షన్) జరిగింది. సీతం కాలేజ్ (విజయనగరం) ప్రాంగణంలో కుమారుడు సందీప్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు అన్ని పార్టీల నాయకులూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.దీంతో ఈ ప్రాంగణాన నవ్వులు పువ్వులు వెల్లివిరిశాయి.ఎన్నడూ లేని విధంగా బొత్స ఈ వేడుకల్లో ఎంతో ఆనందంగా కనిపించారు.
అతిథులను ఆయన స్వాగతించిన తీరు అమోఘం అని పలువురు రాజకీయ నాయకులు కితాబిస్తున్నారు.కాగా వివాహాన్ని హైద్రాబాద్ లో నిర్వహించగా నాటి వేడుకలకు కేటీఆర్ హాజరై బొత్సను ఎంతగానో అభినందించారు.ఆంధ్రుల ప్రేమాదరాలను చూసి పొంగిపోయారు.