కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఝావేరియా, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్‌తో కలిసి స్కానింగ్ మిషన్లను ప్రారంభించారు మంత్రి గంగుల కమలాకర్. అనంతరం ఆసుపత్రిలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ సందర్భంగా మిషన్ల పనితీరును అడిగి తెలుసుకొని, సంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి గంగుల కమలాకర్. ఆసుపత్రిలో తీసుకుంటున్న చర్యలు, అభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించి, పలు సూచనలు చేశారు మంత్రి గంగుల కమలాకర్. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికీకరిస్తూ నిరుపుదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మంత్రి గంగుల కమలాకర్.
ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని భావించిన సీఎం కేసీఆర్.. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేట్‌కు ధీటుగా తీర్చిదిద్దుతున్నారన్నారు. అత్యాధునిక మిషనరీలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. నిరుపేదలకు వైద్యం అందించేందుకు గొప్ప సంస్కరణలు చేపట్టామన్నారు. కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో మరో కొత్త పరీక్ష అందుబాటులోకి వచ్చిందని, ప్రైవేటులో రూ.3వేల నుంచి ఆ పై విలువజేసే స్కానింగ్ సెంటర్‌ను కరీంనగర్ మాతా శిసు సంరక్షణ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చేసిందని వివరించారు మంత్రి గంగుల కమలాకర్.