జాగ్రత్త.. రాంగ్‌ రూట్‌, ట్రిపుల్‌ రైట్‌ వెళ్తున్నారా.. భారీ జరిమానా తప్పదు..

-

ట్రాఫిక్‌ పోలీసులు హైదరాబాద్‌ నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించేందుకు ఇటీవల ఆపరేషన్‌ రోప్‌ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే.. రూల్స్ పాటించని వాహనదారులకు జరిమానాలు విధిస్తున్నారు. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద సర్కిల్స్ వద్ద స్టాప్‌ లైన్ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌ను బ్లాక్‌ చేస్తే రూ.1000, పాదాచారులకు అడ్డు కలిగించేలా వాహనాలు నిలిపితే రూ.600 ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తే భారీ ఫైన్స్ విధిస్తున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్‌ రోప్‌’ విజయవంతం కావడంతో.. తాజాగా ట్రాఫిక్‌ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు ట్రాఫిక్‌ పోలీసులు.

Topic · Traffic violations · Change.org

ఇందులో భాగంగా రాంగ్‌ రూట్‌లో డ్రైవింగ్‌ చేస్తూ రూ.1700, ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1200 ఫైన్ వేయనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 28 నుంచి రాంగ్‌రూట్‌, ట్రిపుల్‌ డ్రైవింగ్‌పై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించనున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. ట్రాఫిక్‌ పోలీసులెవ్వరూ లేరు కదా అని ఇష్టానుసారంగా వాహనం నడిపినా.. ఎవరూ చూడడం లేదని నిబంధనలకు విరుద్ధంగా సిగ్నల్స్‌ జంప్‌ చేసినా సీసీ కెమెరాల్లో దృశ్యాలను బట్టి.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా నిబంధనల మేరకు వాహనాలను నడుపుతూ ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలుగకుండా చూడాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news