జగన్ కోసం, వైసీపీ కోసం ప్రజాస్వామ్యం లేదు : పవన్‌

-

విశాఖ నేడు మూడో రోజు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ కోసం, వైసీపీ కోసం ప్రజాస్వామ్యం లేదన్నారు. వైసీపీ ఎంపీ కుటుంబాన్ని రౌడీషీటర్ లు కిడ్నాప్ చేయడానికి సిరిపురంలో ఉన్న భూముల వ్యవహా రమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. వైజాగ్ ఎంపీకి సిగ్గు లేదు.. ఓట్లేసిన ప్రజలు గెలిపిస్తే వ్యాపారం చేయలేక పారిపోతాను అంటున్నాడని, ఎంపీ రాజీనామా చేయామళ్లీ ఎన్నికలు పెట్టుకుంటామన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ కోర్టులు చుట్టూ తిరగాలిసిందేనని, చర్చి ఆస్తులు దొబ్బేసి వాస్తు దోషం అంటూ ప్రజలు తిరిగే రోడ్లు మూసేస్తారా….? అధికారులు సిగ్గుపడాలని ఆయన అన్నారు.Pawan Kalyan: 'వాళ్లు క్షేత్రస్థాయిలో రెచ్చిపోతున్నారు'.. ఏపీ ప్రభుత్వంపై  పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు.. - Telugu News | Janasena President Pawan  Kalyan Sensational Comments on ...

అంతేకాకుండా.. ‘సీఎం పేషీల్లోనే ఫైళ్లు మరిపోతుంటే జీవీఎంసీలో పైరవీలు జరగడం పెద్ద విషయం కాదు…. 18వేల పైచిలుకు గజాల భూమిని వైసీపీ నేతలు దోపిడీ చేశారు…అందు కోసం తప్పుడు జీవో లు సృష్టించారు.. . దేవుడి భూములను వైసీపీ నేతలు కబ్జా పెట్టేశారు… భూముల దోపిడీ కొనసాగితే ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డ్ అవుతుంది… ఏయూ విద్యార్ధులపై పోరాటం చేయాలి… యూనివర్సిటీలో పరిస్థితులు మారుస్తాం… దేశ రక్షణకు కీలకమైన విశాఖలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని, హోం మంత్రి దృష్టిలో ఉన్నాయి… విశాఖను కేంద్రం ప్రత్యేక దృష్టిలో చూస్తోంది.’ అని పవన్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news