నానమ్మ జ్ఞాపకార్ధంగా స్కూల్ భవనం కట్టిస్తున్న మంత్రి కేటీఆర్

-

రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన నానమ్మ వెంకటమ్మ జ్ఞాపకార్థంగా స్కూల్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. నానమ్మను స్మరించుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం గురించి ఆలోచించడం లేదన్నారు. నా గ్రామం -నా పాఠశాల కార్యక్రమం కింద తన సొంత ఖర్చులతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు కేటీఆర్.

 

అయితే ఇటీవలే ట్విట్టర్ వేదికగా.. యంగ్ ఇండియా కల సాకారం కావాలంటే.. కుల,మతాలను పక్కన పెట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యుత్తమమైన వాటితో పోటీ పడాలని విజ్ఞప్తి చేశారు. డెవలప్మెంట్ నేషనల్ ఇజం యువత ఎజెండాగా ఉండాలని కేటీఆర్ పేర్కొన్నారు. భారత దేశాన్ని ప్రపంచంలోనే సముచిత స్థానం లో నిలిపేందుకు దారులను వెతుక్కోవాలి అన్నారు. ఇది ఇప్పటికీ కాకపోతే ఎప్పటికీ కాదు అని కేటీఆర్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news