స్వార్థ ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు : కేటీఆర్‌

-

మరోసారి బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. మరోసారి ఎక్స్‌ వేదికగా.. విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో హింస, ద్వేషపూరిత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. కొందరి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు.

KTR demands apology from PM

ముస్లింలపై విద్వేషాలు నూరిపోయడం సరికాదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. యువత శాంతివైపు నడవాలని సూ చించారు. దేశం గాంధేయవాదం వై పు నడవాలో? లేదా గాడ్సే మార్గం లో నడవాలో? ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పారు. విషపూరిత రాజకీయాలతో ముస్లింలపై యువతలో ద్వేషమనే విషబీజాన్ని నాటడం సరికాదని, ఇది దేశ భవిష్యత్తుకు మంచిది కాదని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. క‌ర్ణాట‌క‌లో క‌నీసం రేష‌న్ ఇవ్వ‌లేని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ‌కు వ‌చ్చి డిక్ల‌రేష‌న్ ఇస్తే న‌మ్మేదెవ‌రు? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. చైత‌న్యానికి ప్ర‌తీకైన తెలంగాణ ప్ర‌జ‌లు.. ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్ పేరిట విజ‌న్ లేని కాంగ్రెస్‌.. డ‌జ‌న్ హామీలు ఇచ్చినా వాటిని ఎవ‌రూ న‌మ్మ‌రు అని స్ప‌ష్టం చేశారు. ఆ హామీల‌న్ని గాలిలో దీపాలే అని కేటీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వ‌చ్చిన 75ఏండ్ల త‌ర్వాత కూడా ఎస్సీలు, ఎస్టీలు వెనుక‌బ‌డి ఉన్నారంటే.. అందుకు కార‌ణం కాంగ్రెస్ పార్టీనే అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news