కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలి : మంత్రి కేటీఆర్‌

-

కేంద్రంపై మరోసారి డిమాండ్‌ల వర్షం కురిపించారు రాష్ట్ర చేనేత, జౌళీశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగానికి ఊతమివ్వాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలన్నారు మంత్రి కేటీఆర్‌. నేతన్నల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని కోరినా కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు మంత్రి కేటీఆర్‌. కేంద్ర బడ్జెట్‌లో కొన్నేళ్లుగా తెలంగాణకు అందుతున్నది శూన్యమని, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు, సిరిసిల్ల మెగా పవర్‌లూం క్లస్టర్‌కు నిధులు ఇవ్వాలన్నారు మంత్రి కేటీఆర్‌.

KTR seeks Centre's cooperation for speedy growth

టెక్స్‌టైల్‌, చేనేతరంగంపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలన్నారు మంత్రి కేటీఆర్‌. బ్లాక్‌ లెవల్‌ హ్యాండ్‌లూం క్లస్టర్ల ఏర్పాటుకు నిధులు ఇవ్వాలన్నారు మంత్రి కేటీఆర్‌. టెక్స్‌టైల్‌, నేతన్నల పరిస్థితిపై కేంద్రానికి కనీస అవగాహన లేదని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. నేతన్నల పట్ల చిత్తశుద్ధిని చాటుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నానన్నారు మంత్రి కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news