పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపుపై స్పందించిన కేటీఆర్‌..

-

కేంద్ర ప్రభుత్వం నిన్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన.. పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు వంటగ్యాస్‌ను రికార్డు స్థాయిలో ధరలను పెంచిన కేంద్రం.. కంటితుడుపు చర్యగా స్వల్పంగా ధరలను తగ్గించిందన్నారు. అయినా ఇంకా ధరలు సామాన్యుడికి భారంగానే ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. ముందు అసలు ధరలు పెంచింది ఎవరు.. ఇప్పుడు తగ్గింపు పేరుతో ప్రజలను మోసం చేస్తుంది ఎవరూ అంటూ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

KTR warns LMA of water, power cut

ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో ‘నా పాఠశాల పక్కన ఉన్న ఓ దుకాణాదారుడు పీక్‌ సీజన్‌లో ధరలను 300శాతం పెంచి.. ఆపై ప్రజలను మోసం చేయడానికి దానిని 30శాతం తగ్గించే వాడు. అతని సన్నిహితులు దాన్ని బంఫర్‌ ఆఫర్‌గా అభివర్ణిస్తూ.. అతనికి ధన్యవావాలు తెలిపేవారు. ఇది ఎక్కడో విన్నట్లు అనిపిస్తుందా…? ముందు అసలు ధరలు పెంచింది ఎవరు..?’ అని ట్వీట్‌ చేశారు. దీనికి నెటిజన్లు ఇలాంటి పని చేసేది ఇంకెవరూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటూ సమాధానాలు ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news