అధికారం.. తంబాకు, లవంగం కాదు ప్లీజ్ ప్లీజ్ అంటే ఇవ్వడానికి : కేటీఆర్‌

-

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిన్న హైదరాబాద్‌లో పర్యటించి.. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమిత్‌ షా టీఆర్ఎస్‌ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేశారు. అమిత్‌ షా వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఆదివారం మంత్రి కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారం తంబాకు, లవంగం కాదు ప్లీజ్‌ ప్లీజ్‌ అంటే ఇవ్వడానికి అని ఆయన మండిపడ్డారు. బీజేపీ స్టీరింగ్ కార్పొరేట్ల చేతుల్లో ఉందని, కాంగ్రెస్ దద్దమ్మ పార్టీ.. పటేల్ బొమ్మను బీజేపీ ఎత్తుకు పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. నీళ్ల వాటా ఎనిమిదేళ్ళలో ఎందుకు పరిష్కరించ లేదని, 811 టీఎంసీల నీటిలో తెలంగాణ వాటా తేల్చు అని ఆయన అన్నారు.

రంగారెడ్డి – పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వండని, రివర్ మేనేజ్మెంట్ బోర్డుల వల్ల తాత్సారం అవుతుంది. ఇతర రాష్ట్రాలకు ముద్ద పెట్టె స్థాయికి ఎదిగింది. గుజరాత్ లో కట్టిన నరేంద్ర మోడీ స్టేడియంలో మా తెలంగాణ పైసలు ఉన్నాయని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. పచ్చి అబద్ధాలు మాట్లాడకు.. తెలంగాణకు సెల్యూట్ కొట్టు… నియామకాల విషయంలో ఫైల్ కేంద్రం దగ్గర పెట్టుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version