కేసీఆర్‌ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది : మల్లారెడ్డి

-

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్‌ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధ సాధించిందని తెలిపారు. శామీర్‌పేట మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నేతలు గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలో కష్టాలన్నింటికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమని విమర్శించారు.

కాంగ్రెస్‌, బీజేపీలతో ఒరిగేదేమీ ఉండదన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. పార్టీలో చేరినవారిలో జీడిపల్లి జనార్ధన్‌రెడ్డి, హరిబాబు, నర్సింగ్‌రావు, అభిలాష్‌, నర్సజీ, పెంటోజీ, మల్లేశ్‌, మనోజ్‌కుమార్‌, సురేశ్‌, చింకు బాబు, వెంకటేశ్‌, ఎల్లం, శివమ్‌, బాబు, నర్సింహారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, నారంరెడ్డి, వి.కుమార్‌యాదవ్‌, వర్ధన్‌ రాజు, తదితరులు ఉన్నారు.

ఇది ఇలా ఉంటె, వచ్చే ఎన్నికల్లో మేడ్చల్‌ స్థానం అత్యంత కీలకంగా మారబోతోంది. ఇక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి మల్లారెడ్డి బరిలో ఉండబోతున్నారు. ప్రజల్లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న తీన్మార్‌ మల్లన్న కూడా మేడ్చల్‌ నుంచి పోటీ చేయబోతున్నారు. స్టేట్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న ఈటెల భార్య కూడా ఇప్పుడు ఈ స్థానం నుంచి పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో మేడ్చల్‌ పోరు అత్యంత ఆసక్తిగా మారబోతోంది. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలోనే కాబోతోంది. చూడాలి మరి ఈ త్రిముఖ పోరులో మేడ్చల్‌ స్థానాన్ని ఎవరు దక్కించుకుంటారో.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version