ఇటీవల ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రభుత్వంపై లిక్కర్ కు సంబంధించిన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఎటువంటి నాణ్యత లేని లిక్కర్ ను తయారుచేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని కామెంట్స్ చేశారు. దీనిపై తాజాగా మంత్రి నారాయణ స్వామి విశాఖలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎక్సయిజ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చి స్పందించారు. ఈ రాష్ట్రంలో ఒక్కరైనా లిక్కర్ ను తాగి మరణించినట్లు మీ దగ్గర ఆధారాలుంటే చెప్పాలని, మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి నారాయణస్వామి కోరారు. మేము చెబుతున్న ప్రకారం లిక్కర్ వలన ఎవ్వరూ ప్రాణాలను కోల్పోలేదు.. ఇది వాస్తవం అని తెలియచేశారు నారాయణ స్వామి. ఒకవేళ ఎవరైనా లిక్కర్ వలన మరణించి ఉంటే ఆధారాలు చూపించిన మరుక్షణమే నేను నా పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు నారాయణ స్వామి.
మరి నారాయణ స్వామి చేసిన సవాలును ఎవరైనా స్వీకరించి ఆధారాలను ఇస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.