పొంగులేటికి మంత్రి పువ్వాడ అజయ్ సవాల్

-

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు మంత్రి పువ్వాడ అజయ్. పొంగులేటికి దమ్ముంటే పార్టీకి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. టిఆర్ఎస్ జండా వదలడం అంటే తన గొయ్యి తాను తవ్వుకున్నట్టేనని అన్నారు. పార్టీ బీఫాం తీసుకుని వ్యతిరేకంగా పనిచేసిన వారిని సస్పెండ్ చేస్తామని అన్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలు, రాజకీయాల పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటాయి కానీ వ్యక్తుల మీద పార్టీలు ఆధారపడవన్నారు.

 

వైరా లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తనదేనని అన్నారు. డిసెంబర్ 31 వరకు అంటే అభివృద్ధి కోనసాగుతూనే ఉన్నాయి కదా జనవరి ఒకటో తారీకు నుంచి ఆగిపోయిందా..? అని ప్రశ్నించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ గాలే వీస్తుందని.. జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ పదికి పది స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవరు బిఆర్ఎస్ పార్టీ జండా వదిలేస్తారో వారు వారి బొంద తోవ్వకున్నట్టేనని అన్నారు.

“కొంతమంది దుమ్ము ఉంటే సస్పెండ్ చెయ్ అంటున్నావు.. నీకు దమ్ముంటే పార్టీకి రాజీనామా చెయ్. పార్టీ బీఫామ్ తీసుకొని పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని సస్పెండ్ చేస్తాం. కెసిఆర్ ఇలాంటి ఉడతవూపులకు భయపడే మనిషి కాదు. కెసిఆర్ కి నమ్మకంగా ఉన్నవాళ్లే ఈ పార్టీలో ఉండండి, లేదంటే ఈ పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్లిపోండి. కెసిఆర్ కి నేను చెప్తే వచ్చిన వైరా నియోజకవర్గాన్ని గెలిపించే బాధ్యత నాదే. వైరా మున్సిపాలిటీకి అవిశ్వస తీర్మానం పెట్టం. మేము పెట్టిన కుడే కదా తినండి. ఎన్ని రోజులు ఆ పదవులో ఉంటారో ఉండండి” అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news