రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి బాగ్ అంబర్ పేటలోని నారాయణ కాలేజీలో జరిగిన సంఘటనపై స్పందించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు సబితా ఇంద్రారెడ్డి. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు సబితా ఇంద్రారెడ్డి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సబితా ఇంద్రారెడ్డి సూచించారు.
కాలేజీ నుంచి విద్యార్థికి టీసీ అందకపోవడంతో ప్రిన్సిపల్‌ను నిలదీసేందుకు వెళ్లిన సమయంలో విద్యార్థి నేత ఆత్యహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఈ సమయంలో విద్యార్థి నేత ఒంటిపై పెట్రోలు పోసుకున్నాడు. పక్కనే కృష్ణాష్టమి సందర్భంగా అక్కడ దీపం వెలిగించి ఉండటంతో అది అంటుకొని అతనికి తీవ్రమైన గాయాలయ్యాయి. అతన్ని కాపాడేందుకు ప్రయత్నించిన ప్రిన్సిపల్, మిత్రుడు కూడా గాయాలపాలైనట్లు తెలిపారు పోలీసులు.