బాసర ట్రిపుల్ ఐటీ పరిణామాలపై మంత్రి సత్యవతి కీలక ఆదేశాలు

-

ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన పని లేదని.. చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కారం అవుతాయని తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. చిన్న విషయాల కోసం పోయి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దని.. డిమాండ్లను తీర్చేందుకు పని చేస్తున్నామని వివరించారు. ఎలాంటి ఆందోళన చెందొద్దని.. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యార్థి చనిపోవడం భాదకరమని చెప్పారు.

హాస్టల్ విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారుల కు ఆదేశించారు. ఎక్కడైన అధికారుల నిర్లక్షం చేస్తే చర్యలు తీసుకుంటామని.. కేంద్రం లో 8ఏళ్లుగా అధికారం లో ఉన్న వారికి ప్రజాసంగ్రామ యాత్ర ఎందుకు అని నిలదీశారు.

ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడుతా మంటే అధికారం రాదు జనం గుండెల్లో గూడు కట్టుకుంటే వస్తుందని చురకలు అంటించారు.యాత్ర ల పేరుతో రెచ్చ గొడుతున్నారని… ప్రజా సంగ్రామ యాత్ర కాదు ఢిల్లీకి మోకాళ్ళ యాత్ర చేసి రాష్ట్రం కు రావాల్సి నిధులు తీసుకు రావాలని మంత్రి సత్యవతి రాథోడ్ సవాల్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news