తెలుగు దేశం పార్టీ రాజకీయ భవిష్యత్తును స్వయంగా చంద్రబాబే సమాధి కడుతున్నారని చురకలు అంటించారు. బీజేపీ కూడా ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తోందని.. చంద్రబాబు రాజకీయ నిష్క్రియాత్మక పరిస్థితికి, చేతకాని తనానికి చివరి ఎన్నికలు అన్న వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. తీవ్రమైన ఫ్రస్టేషన్ కనిపిస్తోందని.. రాజకీయం కోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా దిగజారుతాడని ఆగ్రహించారు.
చంద్రబాబు భార్య అయినా తనను రాజకీయాల్లోకి లాగొద్దని ఎందుకు వారించటం లేదో అర్థం కావటం లేదని.. ఎందుకీ చేతకాని రాజకీయాలు?? అని నిలదీశారు మంత్రి సిదిరి అప్పలరాజు. భార్యను అడ్డం పెట్టుకొని ఎంత కాలం చంద్రబాబు రాజకీయాలు చేస్తాడు?? అంత హేయకరమైన చర్య ఇదన్నారు. దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని.. చంద్రబాబు చరిత్ర శనక్కాయలు దొంగతనం చేయటం దగ్గర నుంచి మొదలవుతుందని ఎద్దేవా చేశారు మంత్రి సిదిరి అప్పలరాజు.