ప్రతిపక్ష పార్టీలది పదవులు అమ్ముకునే సంస్కృతి : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

-

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ట్టణ ప‌రిధిలోని కాంగ్రెస్ నాయకుడు అన్వర్, పీ పాండు, రహీం, బషీర్ సహా పలువురు మహిళల‌తో పాటు సుమారు 200 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తుంటే కొన్ని మతతత్వ శక్తులు మత ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నాయని అన్నారు మంత్రి శ్రీనివాస్. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… మహబూబ్‌న‌గర్ పట్టణంలో కొందరు మత ఘర్షణలు సృష్టించాల‌ని కోరుకుంటున్నారని, ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉండటం వారికి ఇష్టం లేదని మంత్రి తెలిపారు. పార్టీలకతీతంగా పట్టణాన్ని ప్రశాంతంగా ఉండేలా చూసుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

Srinivas Goud: Minister Srinivas Goud who responded to the conspiracy to  assassinate .. the facts will be known soon .. | Minister V. Srinivas Goud  responds on his murder conspiracy says the

ప్రతిపక్ష పార్టీలది పదవులు అమ్ముకునే సంస్కృతి అని విమ‌ర్శించారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టపడే వారికే పదవులు వరిస్తాయన్నారు మంత్రి శ్రీనివాస్. పనిచేసే ప్రభుత్వానికి అందరూ అండగా నిలబడాలని ఆయన కోరారు. ఒకప్పుడు మహబూబ్‌న‌గ‌ర్‌లోని హనుమాన్ పుర, పాత పాలమూరు వీరన్నపేట, గణేష్ నగర్ లాంటి ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు అనేక కష్టాలు పడ్డారని మంత్రి గుర్తు చేశారు మంత్రి శ్రీనివాస్. 70 ఏండ్లుగా అధికారం అనుభవించిన నాయకులు స్థానిక సమస్యలను పట్టించుకోలేదన్నారు మంత్రి శ్రీనివాస్. తెలంగాణ ఏర్పడిన తర్వాత తాగునీరు, విద్య, వైద్యంతో సహా సమస్యలన్నింటినీ తీర్చడంతో ప్రజలకు ప్రభుత్వంపై భరోసా ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, ప్రధాన కార్యదర్శి వినోద్, కౌన్సిలర్లు మునీర్ కట్టా రవి కిషన్ రెడ్డి, నాయకులు జీవన్ కుమార్, చిన్న, సుభాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మంత్రి శ్రీనివాస్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news